ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు

Oct 6 2026 1:42 AM | Updated on Oct 6 2026 1:42 AM

● అనంతాపురంలో రగిలిన రాజకీయం ● సొంత పార్టీ నాయకుడిపై రెచ్చిపోయిన మండల ప్రధాన కార్యదర్శి ● సోషల్‌ మీడియాలో ఆడియో వైరల్‌

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చే వినతులపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశిత గడువులోగా బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ తుషార్‌ డూడి, నాన్‌–కేడర్‌ ఎస్పీ రాజశేఖర్‌ రాజు, చిత్తూరు డీఎస్పీ జె.వెంకటనారాయణలతో కలసి అర్జీదారుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భూ తగాదాలు (15), కుటుంబ కలహాలు (6), ఆస్తి తగాదాలు (6) సహా మొత్తం 40 ఫిర్యా దులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

అధికార పార్టీ నేత

బూతుల వర్షం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: చిత్తూరు మండలం అనంతాపురం గ్రామంలో పల్లె ఎన్నికల వేడి అప్పుడే పరాకాష్టకు చేరింది. అధికార పార్టీ నేతల మధ్యే అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామంలో వీధి దీపాలు అమర్చారనే చిన్నపాటి కారణంతో టీడీపీకి చెందిన ఇద్దరు నాయకులు రోడ్డెక్కారు. వీధిలైట్లు వేస్తున్న ప్రవీణ్‌ నాయుడుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్‌ తీవ్రస్థాయిలో రెచ్చిపోయి బూతులతో విరుచుకుపడ్డాడు.

ఎవడ్రా నిన్ను లైట్లు వేయమంది..?

‘మా ఊళ్లో లైట్లు వేయడానికి ఎవడ్రా నువ్వు?’ అంటూ పత్రికల్లో రాయలేని అసభ్య పదజాలంతో శ్యామ్‌ చెలరేగిపోయారు. అధిష్టానం ఆదేశాల మేరకే వీధిలైట్లు వేస్తున్నా అని ప్రవీణ్‌ నాయుడు చెప్పే ప్రయత్నం చేసినా వినకుండా, కులాల పేరు ప్రస్తావిస్తూ నానా బూతులు తిట్టాడు. ‘నేను వచ్చేదాకా రోడ్డుపైనే ఉండు’ అంటూ హెచ్చరించి ఫోన్‌ కట్‌ చేశాడు. కాగా, ఈ బూతుల సంభాషణకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు

ఈ ఘటనతో అనంతాపురంలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్‌ నాయుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ చిత్తూరు పోలీసులు, జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement