పూతలపట్టు మండలం, బైరెడ్డిపల్లె పంచాయతీ బి.రామాపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు కలెక్టర్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని సుమారు 10 కుటుంబాలు రాకపోకలు సాగించే సర్వే నంబర్ 889–3 బీ2 లోని గ్రామకంఠానికి చెందిన ప్రధాన వీధి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించి రాతి కూసాలు నాటి ఫెన్సింగ్ వేసి నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. పూతలపట్టు తహసీల్దార్, మండల సర్వేయర్, రెవెన్యూ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.


