వైభవంగా పుష్పపల్లకి | - | Sakshi
Sakshi News home page

వైభవంగా పుష్పపల్లకి

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

● పోటెత్తిన భక్తులు

పుష్పపల్లకీపై ఊరేగుతున్న వినాయకస్వామివారు

కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శనివారం పుష్పపల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈసేవను తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. వేకువజామున స్వామిని మేల్కొలిపి నిత్య పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేసి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి పుష్పమాలికలతో పుష్పపల్లకిని ముస్తాబు చేశారు. ఉభయదారులు సంప్రదాయబద్ధంగా స్వామికి పూజ సామాగ్రి, పట్టు వస్త్రాలను సమర్పించారు. తర్వాత ఉత్సవమూర్తిని పుష్పపల్లకిలో అధిష్టింపజేశారు. గణనాథుడు పుష్ప పల్లకిలో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.

నేడు తెప్పోత్సవం

ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఆదివారం తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరగనున్నట్లు ఈవో పెంచల కిషోర్‌ తెలిపారు. ఉదయం అభిషేకం, విశేష పూజలు జరుగుతాయన్నారు. రాత్రికి తెప్పోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement