పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ అండర్–19 బాల బాలికల ఫుట్‌బాల్ జట్లను శనివారం పుత్తూరులో ఎంపిక చేశారు. స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఎంపిక పోటీలను డీవైఈవో ఉమామహేశ్వర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా జట్లకు ఎంపిక కోసం జిల్లా నలుమూలల నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొనడం సంతోషకరమన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఎంపికై న వారు ఈనెల 24 నుంచి మూడు రోజుల పాటు పుత్తూరులోని ఎస్‌ఆర్‌ఎస్ డిగ్రీ కళాశాలలో జరిగే రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని వెల్లడించారు. ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఎంఈఓలు, పీడీలు పాల్గొన్నారు.


