దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వారు వీరాభిమానులు. ప్రతి ఏడాది మహాలయ పక్షాల్లో తమ అభిమాన నేతకు పిండ ప్రదానం చేస్తుంటారు. అందులో భాగంగా శనివారం ఈ మేరకు వైఎస్సార్‌సీపీ వి.కోట మండల మహిళా అధ్యక్షులు శశికళ, ఆమె భర్త కుమార్‌రాజా సంప్రదాయబద్ధంగా వైఎస్సార్‌కు పిండ ప్రదానం చేశారు. కుమార్‌రాజా మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా వైఎస్సార్‌కు పిండ ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో పెట్టి పురోహితుడితో శాస్త్రోక్తంగా పూజలు చేయించి శ్రద్ధాంజలి ఘటించారు. – వి.కోట


