సమస్యల పరిష్కారానికి వినతి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి వినతి

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలోని వీబీజీ రామ్‌జీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు సుబ్రమణ్యం, జిల్లా జేఏసీ అధ్యక్షుడు గుణశేఖర్‌ కోరారు. శనివారం ఈ మేరకు డీఆర్‌ఓ మోహన్‌కుమార్‌, డ్వామా పీడీ రవికుమార్‌కు వినతిపత్రాలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ వీబీజీ రామ్‌జీలో పనిచేస్తున్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. గత ఏడేళ్లుగా జీతభత్యాలలో ఎలాంటి పెంపుదల లేకపోవడంతో నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. ఉద్యోగులందరికీ క్యాష్‌లెస్‌ హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన సిబ్బందికి తక్షణమే ఉద్యోగోన్నతులు కల్పించడంతో పాటు గ్రాట్యుటీ సౌకర్యం వర్తింపజేయాలని స్పష్టం చేశారు. గతంలో కమిటీలు వేసి చర్చించినప్పటికీ ఇప్పటివరకు సమస్యలకు తుది పరిష్కారం లభించలేదన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ఈనెల 10వ తేదీలోగా పరిష్కరించాలని, లేకుంటే అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రకటిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా జేఏసీ నేతలు ఎస్‌. శ్రీనివాసులు, సంధ్యారాణి, వెంకట రమణారెడ్డి, పరమశివ, ధనుంజయులు, కిరణ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement