వేగవంతంగా అభ్యంతరాల పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో నమోదైన ఓటర్ల అభ్యంతరాలను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్లు డీఆర్‌వో మోహన్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. డీఆర్‌వో మా ట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 15,76,984 మంది ఓటర్లు ఉన్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన షెడ్యూల్ మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో బోగ స్, మృతి చెందిన వారిని జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,776 పోలింగ్ స్టేషన్‌లలో బీఎల్‌వోలకు ప్రక్రియపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు ఉదయ్‌కుమార్, సురేంద్రకుమార్, పరదేశి, అట్లూ రి శ్రీనివాసులు, పరదేశి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలా
ప్రకృతి వ్యవసాయం
పెనుమూరు(కార్వేటినగరం): ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రైతు సాధికార సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శివశంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం పెనుమూరు మండలం, తిరువిరెడ్డిపల్లిలోని అనిల్‌కుమారి పంట పొలాలతోపాటు, సుధాకర్‌నాయుడు బీఆర్సీ కేంద్రాన్ని సందర్శించారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకిత భావంతో పనిచేయాలన్నారు. తిరివిరెడ్డిపల్లెలోని అనిల్‌కుమారి సాగుచేస్తున్న ఏ గ్రేడ్, ఏటీఎం, ఆర్డిస్, పీఎండీఎస్, అలాగే లైన్ షోయింగ్‌ఽ వరి వంటి పంటలను పరిశీలించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారులు కవిత, గురుప్రసాద్, వెంకటేష్, లక్ష్మి, సుధాకర్‌నాయుడు, రాజమ్మ, హనుమంతు, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.
మూడు నెమళ్ల అప్పగింత
తవణంపల్లె: అనారోగ్యంతో బాధపడుతున్న మూడు నెమళ్లకు వైద్య పరీక్షలు చేయించి పోలీసుల సమక్షంలో అటవీశాఖ అధికారులకు అప్పగించారు. వివరాలు.. మండలంలోని టి.పుత్తూరు సమీపంలో నెమళ్లు సంచరిస్తున్నాయి. రైతులు మామిడి తోటల్లో పురుగుల నివారణకు మందులు పిచికారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఏడు నెమళ్లు మామిడి తోటల్లోకొచ్చి అపస్మారక స్థితిలో పడి ఉండగా రైతులు గుర్తించారు. ఇందులో నాలుగు నెమళ్లు పారిపోగా మూడు నెమళ్లును తీసుకొచ్చి తవణంపల్లె వెటర్నరీ డాక్టర్ శ్రీధర్ దగ్గర వైద్యం చేయించడంతో కోలుకున్నాయి. ఆ తర్వాత తవణంపల్లె పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసుల సమక్షంలో అటవీశాఖ అధికారులు రెడ్డె ప్ప, ఉదయ్‌కుమార్‌కు అప్పగించారు.
వేగవంతంగా అభ్యంతరాల పరిష్కారం


