అన్నీ కలుషితం.. స్వచ్ఛాంధ్ర ఎలా సాధ్యం?
తమిళనాడు డైయింగ్ యూనిట్ల దందాతో భూగర్భ జలాలు పాడైపోయి, తాగడానికే కాదు స్నానానికి కూడా వాడలేని పరిస్థితిలో మారి నగరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం నగరిలో నిర్వహించడంపై నగరి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన నీటితో కుశస్థలి నది కూడా ఎరుపెక్కింది. నగరి పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో సేకరించి పరీక్షించిన నీటిలోయురేనియం, మాంగనీసు మోతాదుకన్నా ఏడింతల నుంచి పదింతలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇంత కలుషితం నగరిలో పేరుకుపోయి పారుతుంటే స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర ఎలా సాధ్యమంటూ జనం ముక్కు న వేలేసుకుంటున్నారు.


