వైభవంగా.. వసంత పంచమి
కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో శుక్రవారం వసంత పంచమిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూ జలు నిర్వహించారు. తర్వాత సరస్వతీదేవి, సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి ఆస్థాన మండపంలో కొలువుదీర్చా రు. ఉత్సవమూర్తులకు విశేష పూజ లు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాసాన్ని ప్రారంభించారు. చిన్న పిల్లల చేత తల్లిదండ్రులు, ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యు లు అక్షరాలు దిద్దించారు. తల్లిదండ్రులు, పిల్లల రాకతో ఆలయం రద్దీగా కనిపించింది. కార్యక్రమంలో ఈవో పెంచలకిషోర్, చైర్మన్ మణినాయుడు, ఆలయ అధికారు లు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సవమూర్తికి పూజలు చేస్తున్న పండితులు
అక్షరాభ్యాసంలో పిల్లలు, తల్లిదండ్రులు
వైభవంగా.. వసంత పంచమి


