సీఎం పర్యటన ఇలా..
నగరి : సీఎం చంద్రబాబు పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉ దయం 11.20 గంటలకు నగరి పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుంటారని, అనంతరం 11.30కు శాప్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు నగరి పట్టణంలోని బాలురు, బాలికల ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లను పరిశీలిస్తారు. 2.15 గంటలకు నగరి ఏరియా ఆస్పత్రి చేరుకుని వైద్యులు, రోగులతో సంభాషిస్తారు. 2.40 గంటలకు జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రాజకీయ సమావేశంలో పాల్గొని 3.55 గంటలకు హెలిప్యాడ్ నుంచి ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారని పేర్కొన్నారు.


