కార్తీక పౌర్ణమి పూజల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు: కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ, కుమారై శ్రీశక్తి బుధవారం తిరువణ్ణామలై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అరుణాచలేశ్వర ఆలయానికి చేరుకున్న పెద్దిరెడ్డికి అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి పాల్గొన్నారు.
కాణిపాకంలో జ్వాలా తోరణం
కాణిపాకం: కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని స్థానిక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో బుధవారం భక్తి ప్రపత్తులతో పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జ్వాలాతోరణం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఉత్సవమూర్తిని ఊరేగించారు. కార్యక్రమంలో ఈఓ పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, భక్తులు తదితరులు పర్యవేక్షించారు.
కార్తీక పౌర్ణమి పూజల్లో మాజీమంత్రి పెద్దిరెడ్డి


