టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు నగరంలోని పలువురు టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి టీడీపీ నాయకులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. నగరంలోని 43వ డివిజన్‌కు చెందిన టీడీపీ నాయకుడు నూతన ప్రసాద్, మరో ముగ్గురు నాయకులకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పారు. అనంతరం విజయానందరెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు టీడీపీ ప్రాబల్యం తగ్గుతోందని, తర్వలో మరికొంతమంది టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం వైఫల్యం చెందిందని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


