మిగతావి దొంగలెత్తుకెళ్లారు! | - | Sakshi
Sakshi News home page

మిగతావి దొంగలెత్తుకెళ్లారు!

Nov 6 2025 8:14 AM | Updated on Nov 6 2025 8:14 AM

మిగతా

మిగతావి దొంగలెత్తుకెళ్లారు!

గుడుపల్లె మండలంలో ఓ ప్రధానోపాధ్యాయుడి చేతివాటం నాడు–నేడు నిధులు స్వాహా తాను బాత్‌రూమ్‌ బిల్లులు మాత్రమే తీసుకున్నానని మిగతా సామగ్రి గురించి తెలియదంని ఎస్కేప్‌ అవుతున్న వైనం రూ.60 లక్షల వరకు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు ప్రస్తుత హెచ్‌ఎం ఫిర్యాదుతో మాజీ హెచ్‌ఎం అక్రమాలు వెలుగులోకి..!

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల భవిష్యత్‌ కోసం ప్రతిష్టాత్మకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టి నాడు–నేడు నిధులను ఓ ప్రధానోపాధ్యాయుడు కాజేసిన వైనం వెలుగుచూసింది. గుడుపల్లె మండలం తలే అగ్రహారం జెడ్పీటీసీ ఉన్నత పాఠశాలలో గతంలో హెచ్‌ఎంగా పని చేసిన సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. అయితే సదరు హెచ్‌ఎంపై ప్రస్తుతం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తాను బాత్‌రూమ్‌ల బిల్లులు మాత్రమే తీసుకున్నానని చెప్పి.. వాటిని పూర్తి చేసి.. మిగతావి దొంగలు ఎత్తుకెళ్లారని చెబుతుండడం గమనార్హం.

గుడుపల్లె: మండలంలోని తలేఅగ్రహారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 116 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 8 మంది ఉపాధ్యాయులు, ఒక హెచ్‌ఎం ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో రెండో విడత నాడు–నేడు కింద రూ.1.40 కోట్లు పాఠశాల అభివృద్ధి కోసం మంజూరు చేశారు. ఇందులో రూ.50 నుంచి రూ.60 లక్షలు పక్కదారి పట్టిందని గ్రామస్తులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు రికార్డులు పరిశీలించి విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. పాఠశాలలోని రెండు గదులకు పైకప్పు వేసి అసంపూర్తిగా వదిలిపెట్టారు. ఉన్నత పాఠశాల గదులు వర్షం పడిస్తే తడుస్తుండడంతో సిమెంట్‌తో పూత పోశారు. నూతనంగా నిర్మించిన బాత్‌రూమ్‌లు సైతం అర్ధాంతరంగా ఆగిపోయాయి. బిల్డింగ్‌ పనులు మరమ్మతులు చేసేందుకు మెటీరియల్‌ ఇసుక, ఇటుకలు, కమ్మీ, జెల్లిలకు బిల్లులు పెట్టి పాఠశాల చుట్టూ డంపింగ్‌ చేసినట్లు బిల్లులు కాజేశారు. కానీ పాఠశాలలో ఎక్కడా మెటీరియల్‌ ఉన్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్న పాత గదులకు మాత్రం సిమెంట్‌ పూత పూసి వదిలిపెట్టారు. పాఠశాల గదుల చుట్టూ ప్రహారీగోడ నిర్మాణం కోసం బిల్లులు పెట్టి రికార్డులు సృష్టించి డ్రా చేసినట్లు సమాచారం. పాఠశాల నుంచి విద్యార్థులు బయటికి రావాలంటే రోడ్డుపైకి రావాలి. ప్రహారీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

బాత్‌రూమ్‌ల బిల్లులు మాత్రమే తిన్నాడట..

నూతనంగా వచ్చిన హెచ్‌ఎం నాడు–నేడుకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలన చేయడంతో నిధుల దుర్వినియోగం విషయం బయటపడింది. గ్రామస్తులను పిలిపించి పంచాయతీ ఏర్పాటు చేశారు. గతంలో పని చేసిన హెచ్‌ఎం బాత్‌ రూమ్‌లకు సంబంధించిన బిల్లులు మాత్రమే తాను తీసుకున్నానని, దానికి కావాల్సిన బాత్‌రూమ్‌లు పూర్తి చేస్తామని చెప్పారు. అందులో భాగంగా సదరు హెచ్‌ఎం బాత్‌రూమ్‌ పనులు పూర్తి చేయించాడు. మిగిలిన నిధులు తనకు సంబంధం లేదని చేతులు ఎత్తేశాడు. ఇసుక, ఇటుకలు, కమ్మీలు, జెల్లి మెటీరియల్‌ పాఠశాల వద్ద తెచ్చామని, ఎవరో దొంగలు తీసుకెళ్లినట్లు చేతులు ఎత్తేశారు. వర్షం పడితే గదులు ఉరవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంగా డీవైఈఓ ఇందిరమ్మను వివరణ కోరగా, తలే అగ్రహారం పాఠశాల నిధులు దుర్వినియోగంపై తనకు ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే ఏపీసీ అధికారులతో చర్చించి పాత హెచ్‌ఎం, కొత్త హెచ్‌ఎంతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. పాఠశాలకు తోలిన మెటీరియల్‌ ఎవరు కాజేసింటే వారితో కట్టిస్తామన్నారు. పొరబాట్లు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

మిగతావి దొంగలెత్తుకెళ్లారు!1
1/2

మిగతావి దొంగలెత్తుకెళ్లారు!

మిగతావి దొంగలెత్తుకెళ్లారు!2
2/2

మిగతావి దొంగలెత్తుకెళ్లారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement