దొంగ అరెస్టు
శ్రీరంగరాజపురం : మండలంలో ఇటీవల ఓ ఇంటిలో చోరీకి పాల్పడిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ సుమన్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వీవీ పురం పంచాయతీ గంగమ్మగుడి గ్రామానికి చెందిన కె.చిట్టిబాబునాయుడు ఇంటిలో ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా ఈవీఆర్ మనాలి గ్రామానికి చెందిన జి.గోపాలకృష్ణ కుమారుడు జి.సుందర్రాజు (24) తలుపులు పగలగొట్టి బంగారం, నగదు దొంగలించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైన్నె నగరంలోని శ్రీనివాస్ స్ట్రీట్‌లో నిందితుడు సుందర్రాజును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.5 వేలు నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
జాతీయ సాహిత్య పురస్కారానికి కవితా సంపుటి
పలమనేరు: ప్రతిష్టాత్మక ఖమ్మం ఈస్తటిక్స్ జాతీయ సాహిత్య పురస్కారానికి పలమనేరు బాలాజీ రచించిన లోపలేదో కదులుతున్నట్టు అనే కవితా సంపుటి ఎంపికై నట్టు బుధవారం ఆయన తెలిపారు. ఈనెల 9న ఖమ్మలో జరిగే జాతీయ సాహిత్య కార్యక్రమంలో పురస్కారంతో పాటు ఆయన రూ.40 వేల నగదు బహుమతి అందుకోనున్నారు. జాతీయ స్థాయిలో ఇందుకు 90 కవితా సంపుటాలు రాగా పరిశీలన అనంతరం పలమనేరు బాలాజీ రచించిన సంపుటి ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక కవులు, రచయితలు ఆయనను అభినందించారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని..
చిత్తూరు రూరల్ (కాణిపాకం): బైకులు ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడు తీవ్రగాయాల పాలైన ఘటన బుధవారం చిత్తూరు మండలంలో చోటు చేసుకుంది. బీఎన్‌ఆర్‌పేట పోలీసుల వివరాల మేరకు.. చిత్తూరు మండలం ఐనవేడు గ్రామానికి చెందిన కార్తీక్ అనే యువకుడు స్కూటీలో చిత్తూరుకు వెళ్తుండగా, మండలంలోని కృష్ణాపురానికి చెందిన యశ్వంత్ (23) యమహా ఎఫ్‌జెడ్ బైక్‌లో ఎదురుగా వచ్చి ఢీకొన్నాడు. దీంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి యశ్వంత్ మృతిచెందినట్లు వెల్లడించారు. కార్తీక్‌ను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
దొంగ అరెస్టు


