మామిడి రైతులకు న్యాయం చేయండి
గంగాధర నెల్లూరు: మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కిలో రూ.8 మద్దతు ధర ఇవ్వాలని మామిడి రైతుల సంక్షేమ సంఘం నేతలు మండలంలోని జైన్ కర్మాగారం వద్ద బుధవారం నిరసన తెలిపారు. మామిడి రైతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరులోని దుర్గా హోటల్ నుంచి మోటార్ సైకిళ్లపై ర్యాలీగా బయలుదేరి జైన్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద నిరసనకు దిగారు. అనంతరం జైన్ ఫార్మ్ ఫ్రెష్ మేనేజర్ దిలీప్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన కిలోకు రూ.8 మద్దతు ధర ఇవ్వాలన్నారు. మేనేజర్ దిలీప్ ఈ విషయంపై మాట్లాడుతూ యాజమాన్యంతో చర్చించి రైతులకు త్వరలోనే నగదు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మామిడి రైతుల సంక్షేమ సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు..


