రాష్ట్రస్థాయి పోటీలకు డీఎంపురం విద్యార్థి
కార్వేటినగరం: నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జీడీనెల్లూరులో నిర్వహించిన నియోజకవర్గస్థాయి వక్తృత్వ, క్విజ్ పోటీల్లో డీఎంపురం విద్యార్థి సత్తాచాటారని ఆ పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం బొజ్జారాములు అన్నారు. బుధవారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఇన్‌చార్జ్ హెచ్‌ఎం మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ జరిగే రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన పలు వ్యాసరచన పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థి గోవర్ధన్ రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థిని మెమెంటో అందించి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
11న ఇంటర్వ్యూలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆర్టీసీలో అప్రెంటిషిప్‌గా పని చేసేందుకు ఇటీవల దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 11వ తేదీన ఇంటర్వ్యూలు జరుగుతాయని టీపీటీఓ రాము బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఇంటర్వ్యూలు నెల్లూరు జిల్లాలోని జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 10 గంటలకు అక్కడికి చేరుకోవాలన్నారు. వారి వెంట విద్యార్హత పత్రాలను తీసుకెళ్లాలని సూచించారు.
పథకాలపై అవగాహన ముఖ్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని షెడ్యూల్ కులాల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవగాహన ఉండాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. స్వయం ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి, ఆర్థిక స్వావలంబనపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ మాల వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్, డీవీఎంసీ సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విక్రమ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
8,9 తేదీల్లో సౌత్‌జోన్ లెవల్ వాలీబాల్
రొంపిచెర్ల: మండలకేంద్రంలోని రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 8, 9 తేదీల్లో సౌత్‌జోన్ లెవల్ పోటీలు జరుగుతున్నట్లు నిర్వాహకులు షబ్బీర్, రౌనఖ్, ఆజమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే జట్లు 7వ తేదీ సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండవ బహుమతిగా రూ.30 వేలు, మూడవ బహుమతిగా రూ.20 వేలు, నాలుగో బహమతిగా రూ.10 వేలు అందిస్తారన్నారు. క్రీడాకారులకు భోజన, విశ్రాంతి వసతి ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీలు డే అండ్ నైట్ జరుగుతాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.200 చెల్లించాలన్నారు. వివరాల కోసం 9666629828, 8608195240, 9666100630 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
దివ్యాంగ నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగు నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న ట్లు యూత్ ఫర్ జాబ్స్ ఫౌండేషన్ నిర్వాహకురా లు భవ్య తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని నిరుద్యోగ దివ్యాంగులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిరుద్యోగు దివ్యాంగులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కంప్యూటర్, కమ్యూనికేషన్ శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఏదైనా విద్యార్హత కలి గి శారీరక దివ్యాంగులు, మూగ, చెవుడు లోపం ఉన్న వారు (వారి పని వారు చేసుకునే వారై) ఉండాలన్నారు. 18–34 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హత పత్రాలు, ఆధార్, సదరం సర్టిఫికెట్లతో తిరుపతి భవానీ నగర్‌లోని యూత్ ఫర్ ఫౌండేషన్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. వివరాలకు 9347411952, 9392923884 నంబర్లలో సంప్రదించాలన్నారు
రాష్ట్రస్థాయి పోటీలకు డీఎంపురం విద్యార్థి


