ఏసీఏ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలకు తరుణ్
పలమనేరు: ఏపీ క్రికెట్ అకాడమీ అండర్–14 అంతర్ జిల్లా క్రికెట్ జట్టుకు పలమనేరు పట్టణానికి చెందిన తరుణ్‌కుమార్ రెడ్డి ఎంపికై నట్టు కోచ్ బాలాజీ బుధవారం తెలిపారు. బీసీసీఐ ఆధ్వర్యంలో కడప వైఎస్సార్ స్టేడియంలో ఎంపిక జరిగినట్టు పేర్కొన్నారు. తాజాగా జరిగిన రెండ్రోజుల టెస్ట్ మ్యాచ్‌లో తరుణ్‌కుమార్ రెడ్డి తన స్పిన్ మాయాజాలంతో 14 ఓవర్లు బౌలింగ్ చేసి మూడు మెయిడిన్ ఓవర్లు వేసి, 38 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లను తీశాడు. దీంతో సెలక్టర్లు ఇతన్ని జట్టులోకి ఎంపిక చేశారు. తరుణ్‌కుమార్‌రెడ్డిని చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీలు శ్రీనివాసమూర్తి, సతీష్ యాదవ్ అభినందించారు.


