గుట్టలో పంచాయతీ కార్యాలయం వద్దు
గుడిపాల: గుడిపాల మండలంలోని గట్రాళ్లమిట్ట పంచాయతీకి నూతనంగా రూ.32 లక్షలతో ప్రభుత్వం పంచాయతీ భవనం మంజూరు చేసింది. గ్రామస్తులు గ్రామం మధ్యలోని గ్రామకంఠం భూమిలో పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. కానీ కొంతమంది కూటమి నాయకులు ఆ భూమిని కబ్జాచేయాలనే ఉద్దేశంతో గ్రామానికి దూరంగా ఉన్న గుట్టలో పంచాయతీ భవనాన్ని నిర్మిచాలని అధికారులపై ఒత్తిడి చేశారు. అధికారులు చేసేది లేక గుట్టలోని స్థలాన్ని చదును చేశారు. ఇక్కడ భవనం కట్టినట్లయితే గ్రామానికి దూరంగా ఉండడంతో పాటు తరచూ పాములబెడద ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై గ్రామస్తులందరూ కలిసి జిల్లా కలెక్టర్‌కు కూడా పీజీఆర్‌ఎస్‌లో అర్జీని సమర్పించారు.


