లారీకి బ్రేక్ ఫెయిల్!
● టీ స్టాల్‌లోకి దూసుకెళ్లిన వైనం ● డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు
బంగారుపాళెం: లారీకి బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి టీ దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన మండలంలోని మొగిలి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీ బ్రేక్ ఫెయి కావడంతో డ్రైవర్ వేగ నియంత్రణ చేయలేక ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టాడు. ఆపై రహదారి పక్కనే ఉన్న టీ దుకాణంలోకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్, క్లీనర్‌ను చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


