టెట్‌తో వేధించొద్దు!
పూతలపట్టు: టెట్ పరీక్ష నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించాలని ఎస్టీ యూ జిల్లా అధ్యక్షుడు మదన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు బోధనలో అనుభవం కలిగి ఉపాధ్యాయులను కూటమి ప్రభుత్వం వేధించడం తగదన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జారీ చేసిన జీవో నం.36 వల్ల సుమారు లక్ష పదివేల మంది ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర నాయకులు పురుషోత్తం మాట్లాడుతూ మధ్యంతర భృతి 30 శాతానికి గ్గకుండా ఇవ్వాలన్నారు. ఆ సంఘ రాష్ట్ర కమిటీ కన్వీనర్ దేవరాజులురెడ్డి, నాయకులు చంద్రన్, సుబ్రమణ్యపిళ్లై, జగదీశ్వర పిళ్లై పాల్గొన్నారు.


