పర్యాటక ప్రాంతంగా ముసలమడుగు
పలమనేరు: ముసలమడుగు కుంకీ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా మార్చాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ఆ మేరకు మండలంలోని కుంకీ ప్రాజెక్టును మంగళవారం ఆయన సందర్శించారు. ఈ నెల 7, 8 తేదీలలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుంకీ ఏనుగుల ప్రాజెక్టును పరిశీలించేందుకు విచ్చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడున్న కుంకీ ఏనుగులను ఆయన చూసి వాటి ద్వారా ఏనుగుల కట్టడిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ...కార్తీక మాసం కావడంతో ఇక్కడికి జనం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని, ఇక్కడే వనమహోత్సవ కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు. అయితే ఇక్కడున్న ఏనుగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. డీఎఫ్వో సుబ్బరాజు, సబ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ పాల్గొన్నారు.


