నిర్వాహకులు సమాధానం చెప్పాల్సిందే
సీతమ్స్ కళాశాల నిర్వాహకులు తనకు సమాధానం చెప్పి తీరాలని విద్యార్థి రుద్రమూర్తి తల్లి తులసి డిమాండ్ చేశారు. కళాశాల వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. హెచ్‌వోడీ యువరాజులు తమకు సమాధానం చెప్పాలన్నారు. తన బిడ్డ ప్రాణం పోయినా కళాశాల నుంచి ఒక్కరు కూడా తనకు సమాచారం ఇవ్వలేదనప్నారు. వారం రోజులు ముందు ఆ హెచ్‌వోడీతో మాట్లాడి వెళ్లినట్లు చెప్పారు. తన బిడ్డ మూడో అంతస్తు పై నుంచి దూకేంత మూర్ఖుడేం కాదన్నారు. కచ్చితంగా కళాశాలలో ఏదో జరిగిందన్నారు. లోపలికి వెళ్లి అడిగినందుకు పోలీసు కిందకి తోసేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. చదవకపోతే మంచి మాటలతో చెప్పాలే కానీ హింసించడం ఏమిటని ప్రశ్నించారు.


