
టెంపో ఢీకొని వృద్ధురాలి మృతి
బంగారుపాళెం: మండలంలోని కేజీ సత్రం వద్ద చైన్నె–బెంగళూరు జాతీ య రహదారిపై సోమ వారం టెంపో ఢీకొనడంతో వృద్ధురాలు మృతి చెందింది. వివరాలు.. మండలంలోని కుమ్మరపల్లెకు చెందిన మునస్వామి భార్య రాజమ్మ(67) చిత్తూరు వెళ్తేందు కు కేజీసత్రం గ్రామానికి వచ్చింది. రోడ్డు దాటుతున్న క్రమంలో పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న టెంపో ఢీకొంది. ఈ ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రాజ మ్మ మృతి చెందింది. మృతురాలు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
నేడు మహర్షి వాల్మీకి
జయంతి
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీన మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అధికారులు హాజరుకావాలని కలెక్టర్ కోరారు.
పేదల భూ సమస్యల పై పోరాటం
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా వ్యాప్తంగా పేదల భూ సమస్యలపై సీపీఎం పోరాటం చేసేందుకు నిర్ణయించినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని పేదలు భూ సమస్యలు పరిష్కారం అవ్వక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, వాటి పట్ల రెవెన్యూ అధికారులు చొరవ చూపాలన్నా రు. మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రూ.8ను పరిశ్రమల నిర్వాహకులు చెల్లించడం లేదన్నారు. పరిశ్రమల్లో, ఇతర చోట్ల పనిచేసే వారికి 13 గంటల పనివిధానాన్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం దారుణమన్నారు. సమావేశంలో సీపీఎం పార్టీ జిల్లా నాయకులు సురేంద్ర, గిరిధర్ గుప్తా పాల్గొన్నారు.

టెంపో ఢీకొని వృద్ధురాలి మృతి