
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి
● మృతదేహాన్ని చెరువు కట్టపై పడేసిన ముగ్గురు వ్యక్తులు ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఓ యువకుడు కరెంట్ షాక్‌తో మృతిచెందినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ డీఎస్పీ సాయినాథ్ కథనం.. చిత్తూరు మండలం, బీఎన్‌ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌లో గురువారం అనుమానాస్పద కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చూపించి వివరాలు వెల్లడించారు. యాదమరి మండలం, పట్టపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (25) ఆదివారం బీఎన్‌ఆర్‌పేట చెరువు కట్టపై శవమై కనిపించాడు. స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ విచారణలో గుడిపాల మండలంలోని మంచినీళ్లకుంట గ్రామానికి చెందిన మాధవి ఇంట్లో శనివారం రాత్రి కరెంట్ రాకపోవడంతో సరిచేసేందుకు వెంకటేష్ వెళ్లాడు. కరెంట్ తీగలు సరిచేసే క్రమంలో వెంకటేష్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయాన్ని మాధవి తన తండ్రి రాజా, తమ్ముడు చందుకు చెప్పింది. వీరి సాయంతో మృతదేహాన్ని ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి బీఎన్‌ఆర్‌పేట చెరువు కట్టపై పడేసి వెళ్లిపోయారు. ఇది సీసీ టీడీ ఫుటేజీ ద్వారా వెలుగుచూసింది. దీని ఆధారంగా కేసు విచారణను పూర్తిచేశామని, నిందితులు నేరం ఒప్పుకోవడంతో అరెస్ట్ చూపించి రిమాండ్‌కు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు.