
పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన
నా భర్తను కాపాడండి
పలమనేరు: అంతుచిక్కని వ్యాధితో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భర్తను కాపాడాలని పలమనేరు నియోజకవర్గంలోని, పెద్దపంజాణి మండలం, బట్టందొడ్డి పంచాయతీ గడ్డూరుకు చెందిన రేణుక అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తన భర్త వెంకటరమణ కూలినాలి చేసి కుటుంబాన్ని పోషించేవాడని తెలిపారు. ఏమైందోగానీ ఇటీవల ఆయన కడుపుపై చారలు ఏర్పడ్డాయని చెప్పారు. ఆపై కడుపు బెలూన్‌లా పెరిగిపోతోందన్నారు. పెద్దాస్పత్రుల్లో చూపించుకునే ఆర్థిక స్థోమత లేక అల్లాడుతున్నట్టు వాపోయారు. ఇద్దరు పిల్లల పోషణ, భర్తను ఆస్పత్రిలో చూపించడం కష్టతరమవుతోందని కన్నీటిపర్యంతమయ్యారు. కూటమి ప్రభుత్వం స్పందించి తన భర్తను కాపాడాలని కోరారు.
నారాయణవనం : మండలంలోని తుంబూరు దళితవాడ ప్రాథమిక పాఠశాల విలీనాన్ని విరమించుకోవాలని పిల్లలతో కలిసి తల్లిదండ్రులు, ఏఎస్‌ఎఫ్‌ఐ నేతలు గురువారం తహసీల్దార్, మండల విద్యాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగారు. ఊరి బడిలోనే పిల్లలు చదువుకునే వెసులుబాటును కల్పించాలని, పిల్లలను చదువుకు దూరం చేయొద్దంటూ నినాదాలు చేశారు. అనంతరం డీటీ భాను ప్రకాష్, ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వేర్వేరుగా వినతి పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఉదయ్ కుమార్, మహేష్, తల్లిదండ్రులు మాట్లాడుతూ.. విలీనం పేరుతో పాఠశాలలను మూసివేయడం, డీ గ్రేడ్ చేయడం దారుణమన్నారు. తుంబూరు డళితవాడ పాఠశాలలో చదువుతున్న 56 మంది విద్యార్థులను పది మంది విద్యార్థులే ఉన్న పాఠశాలలో విలీనం చేయడం సరైన విధానం కాదన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యాసాగర్, ఇందుమతి, సారా, భాగ్యరాజ్, గోవిందయ్య, ప్రసాద్, మునివేలు, కుప్పలు, చంద్రయ్య, రవి, రాము, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన

పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన

పాఠశాల విలీనం ఆపాలని ఆందోళన