ఉగ్రదాడి పిరికి చర్య
చిత్తూరు కార్పొరేషన్ : కశ్మీర్‌లో జరిగిన దాడితో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తెలిపారు. దాడికి కారణమైన వారిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడికి నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బుధవారం జ్యోతిరావుపూలే విగ్రహం నుంచి గాంధీవిగ్రహం వరకు నాయకులతో కలిసి దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. కాల్పుల్లో 26 మంది చనిపోవడం, 20 మందికి పైగా గాయాలపాలవడం బాధాకరమన్నారు. డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాయత్రీదేవి, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్ , మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి, ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి మాట్లాడారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లిన వారిని ఇలా చంపడం అత్యంత హేయమన్నారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి ఇలాంటి పిరికిపింద చర్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో నాయకులు నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, గుడిపా మండల పార్టీ అధ్యక్షుడు ప్రకాష్, నాయకులు , ప్రజాప్రతినిధులు సరళమేరి, అంజలిరెడ్డి, ఆను, రజనీకాంత్, అన్బు, లక్ష్మణస్వామి, చల్లాముత్తు, దేవరాజు, శేఖర్, సురేష్, రాజశేఖర్, మనోహర్‌రెడ్డి, స్టాండ్లీ, శివ, చాన్‌బాషా, అల్తాఫ్, అఫ్జల్‌ఖాన్, చామంతి, రంజిత్, రాజేష్, శాంతి, హరీషారెడ్డి, సెల్వ పాల్గొన్నారు.
కశ్మీర్ ఘటనకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ
పాల్గొన్న విజయానందరెడ్డి, చంద్రశేఖర్


