జొమాటో సంచలన నిర్ణయం..! ఇకపై పది నిమిషాల్లోనే డెలివరీ..ముందుగా అక్కడే

Zomato to Soon Launch Zomato Instant for 10 Min Food Delivery - Sakshi

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం పది నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ అందించేందుకు సిద్దమైంది. 

జొమాటో ఇన్‌స్టంట్‌..!
ప్రముఖ గ్రాసరీ సంస్థ జెప్టో కేవలం 10 నిమిషాల్లోనే గ్రాసరీ సేవలను డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. జెప్టో తరహాలోనే ఫుడ్‌ డెలివరీ సేవలను అందించేందుకు జొమాటో సిద్థమవుతోంది. అందుకోసం 'జోమాటో ఇన్‌స్టంట్'ని త్వరలో ప్రారంభించనున్నట్లు కంపెనీ సోమవారం రోజున ప్రకటించింది. వచ్చే నెల నుంచి గురుగ్రామ్‌లోని నాలుగు స్టేషన్లతో జోమాటో ఇన్‌స్టంట్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనుంది. 

మొదటి కంపెనీగా రికార్డు..!
ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ ఫుడ్‌ డెలివరీ సంస్థ 10 నిమిషాల్లోపు తాజా ఆహారాన్ని డెలివరీ చేయలేదు. కేవలం పది నిమిషాల్లో వేడి వేడి, తాజా ఆహారాన్ని అందించే సంస్థగా జొమాటో రికార్డులు క్రియేట్‌ చేయనుందని జొమాటో సీఈవో దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు. రెస్టారెంట్లను క్రమబద్దీకరించడం, సదరు ప్రాంతంలో ఎక్కువగా తినే ఆహార పదార్థాల లిస్టింగ్‌ సహాయంతో ఫుడ్‌ డెలివరీ 10 నిమిషాల్లో చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.  అంతేకాకుండా కస్టమర్ల నుంచి వస్తోన్న డిమాండ్‌ నేపథ్యంలో జొమాటో ఇన్‌స్టంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 

10 నిమిషాల డెలివరీ ఎలా పని చేస్తుందంటే?
జొమాటో ఏర్పాటు చేసే  ప్రతి ఫినిషింగ్ స్టేషన్‌లో డిమాండ్ ప్రిడిక్టబిలిటీ , హైపర్‌లోకల్ ప్రాధాన్యతల ఆధారంగా వివిధ రెస్టారెంట్‌ల నుంచి బెస్ట్ సెల్లర్ వస్తువులు (సుమారు 20-30 వంటకాలు) అందుబాటులో ఉంటాయని గోయల్ చెప్పారు. ఇక కస్టమర్లకు డెలివరీ ఛార్జీలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఛార్జీల తగ్గింపు జొమాటో రెస్టారెంట్ భాగస్వాములతో పాటు,  డెలివరీ బాయ్స్‌కు వారి ఆదాయాల్లో మార్పు ఉండదని తెలిపారు.

చదవండి: ఎంత పని చేశార్రా..! జోమోటో పేరును మార్చేశారుగా..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top