ఇక ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్ కార్డులు వాడొచ్చు!

You can soon use debit cards without any network - Sakshi

డెబిట్ కార్డు వాడేవారికి ఒక తీపికబురు. మనం అత్యవసర సమయాల్లో డబ్బులు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు మెషీన్ లో ఇంటర్నెట్ అవసరం అనే విషయం మన అందరికి తెలుసు. ఒకవేల మన ప్రాంతంలో ఇంటర్నెట్ లేకపోతే ఆ సమయాల్లో మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక సమస్యలకు చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ రాబోతుంది. ఈ టెక్నాలజీ సహాయంతో మనం ఉన్న ప్రాంతంలోనే డెబిట్ కార్డు ద్వారా లావాదేవీలు జరపవచ్చు. ఈ దిశగా వీసా సంస్థ పనిచేస్తుంది. మనకు అందించే చిప్ ఆధారిత వీసా డెబిట్ కార్డు ద్వారా ఇంటర్నెట్ లేకున్నా ప్రతి రోజు రూ.2,000 వరకు లావాదేవీలు జరపవచ్చు.  

ప్రతి లావాదేవీ పరిమితి రూ.200
ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ సంస్థ ఇన్నోవిటి భాగస్వామ్యంతో వీసా ఆఫ్ లైన్ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పద్దతిలో ఒక డెబిట్ కార్డు తయారు చేసింది. ఈ పీఓసీ కార్డును యస్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రీపెయిడ్ కార్డుల ఇతర వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇవి నెట్ వర్క్ క్లౌడ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు పరిమితి రూ.2,000, ప్రతి లావాదేవీ పరిమితి కూడా రూ.200 మాత్రమే అని ఆర్‌బీఐ పేర్కొంది. ఒకవేళ తగిన బ్యాలెన్స్ లేకపోతే లావాదేవీని తిరస్కరిస్తారు.(చదవండి: ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్)

ఈ డెబిట్ కార్డు బ్యాంకు ఖాతాదారులకు, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఇంటర్నెట్ లేని సమయాల్లో వర్తకులతో గోడవపడకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. వీసా ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని మొట్టమొదటి సారిగా మనదేశంలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ శాతం డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ లేని ఫెయిల్ అవుతున్నట్లు గతంలో ఆర్‌బీఐ తెలిపింది. ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకోని వస్తుంది. కోవిడ్ మహమ్మారి రాకతో డిజిటల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. అందుకే, మరింత మందికి ఈ సేవలు అందించేలా బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top