మూడు నెలల కనిష్టమే.. అయినా రెండంకెల పైనే!

WPI-based inflation declines marginally to 15. 18percent for the month of June 2022 - Sakshi

జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 15.18%

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 15.18 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూన్‌తో పోల్చితే ఈ బాస్కెట్‌ ధర 15.18 శాతం పెరిగిందన్నమాట. ఇది మూడు నెలల కనిష్ట స్థాయి. మే నెలతో పోల్చితే ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, రెండంకెలపైనే ఈ రేటు కొనసాగడం ఇది వరుసగా 15వ నెల. ఆహార ధరలు మాత్రం తీవ్రంగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశం.  ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే..

► ఫుడ్‌ ఆర్టికల్స్‌ ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం. మేతో ఈ రేటు 12.34 శాతంగా ఉంది. కూరగాయలు (56.75%), ఆలూ (39.38%), పండ్ల (20.33%) ధరలు భారీగా పెరిగాయి.  
► ఖనిజాల ధరలు మాత్రం 8.55% తగ్గాయి.
► క్రూడ్‌ పెట్రోలియం, సహజవాయువు ధరలు 77.29 శాతం ఎగశాయి.  
► కాగా, జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 7.01%గా నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top