ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్‌.. విప్రో నుంచి 120 మంది అవుట్

Wipro continues layoff 120 employees - Sakshi

గత కొన్ని రోజులుగా మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీల దగ్గర నుంచి చిన్న కంపెనీల వరకు తమ కంపెనీలలోని ఉద్యోగులను వివిధ రకాల కారణాల వల్ల తొలగిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు విప్రో కంపెనీ రీలైన్‌మెంట్ ఆఫ్ బిజినెస్ (Realignment of Business Needs) కారణంగా USలోని ఫ్లోరిడాలో 120 మంది ఉద్యోగులను తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

కంపెనీ, ఫ్లోరిడా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఆపర్చునిటీకి అందించిన వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) నోటీసులో తొలగింపులను గురించి వివరించినట్లు తెలిసింది. టంపాలోని ఒక ప్రదేశంలో మాత్రమే ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు సమాచారం.

కంపెనీ తొలగించిన 120 మంది ఉద్యోగులలో వందమందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లు ఉన్నారు. మిగిలిన వారిలో టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్లు ఉన్నారు. అయితే ఇతర విప్రో ఉద్యోగులందరూ అలాగే ఉద్యోగాలలో కొనసాగుతున్నారని కంపెనీ తెలిపింది. అంతే కాకుండా ఈ నెల ప్రారంభంలో న్యూజెర్సీలోని ఈస్ట్ బ్రున్స్‌విక్‌లో అమెరికా ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించింది.

(ఇదీ చదవండి: Top Car News of The Week: మారుతి బ్రెజ్జా సిఎన్‌జి నుంచి టయోటా హైలెక్స్ వరకు..)

విప్రో కంపెనీ యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో, బ్రెజిల్ వంటి దేశాల్లో దాదాపు 20,500 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా ఇటీవలే ఇండియాలో సరైన పనితీరుని కనపరచని దాదాపు 400 మంది ఫ్రెషర్ ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీలో ఉద్యోగం పొందేవారు సగం జీతానికే పనిచేయాలని చెబుతున్నట్లు సమాచారం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top