చలి కాచే కోటు..

Winter Jacket: Relief From Cold Temperature Invented By London Scientist - Sakshi

చలికాలంలో ఒక్కోసారి స్వెట్టర్లు వేసుకున్నా, చలి తగ్గినట్లుగా అనిపించదు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా నిమిషాల్లోనే ఒళ్లంతా వెచ్చబరచే అరకోటు అందుబాటులోకి వచ్చింది. వేడిని నిల్వచేసుకునే కెమికల్‌ జెల్‌ నింపి రూపొందించిన ఈ వస్త్రవిశేషం ‘ఎంట్రోపీ వెస్ట్‌’. టీషర్ట్‌ లేదా చొక్కా మీదుగా దీనిని అరకోటు ధరించినట్లే సులువుగా ధరించవచ్చు. దీనికి ఎలాంటి బ్యాటరీలతోను, విద్యుత్తుతోను పనిలేదు.

దీనిని యాక్టివేట్‌ చేసుకుంటే చాలు, నిమిషాల్లోనే 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతను అందిస్తుంది. నడుస్తున్నా, కదులుతూ పనులు చేసుకుంటూ ఉన్నా, క్రమంగా వేడి తగ్గి, శరీర ఉష్ణోగ్రత వద్ద స్థిరపడుతుంది. దీని ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తే, ఉడుకు నీళ్లలో కాసేపు నానబెట్టి, ఆ తర్వాత ఆరవేసుకుంటే చాలు. యథాతథంగా పనిచేస్తుంది. ఉడుకు నీళ్లలోని ఉష్ణోగ్రతను ఈ వస్త్రంలోని జెల్‌ గ్రహించి, నిల్వ చేసుకుంటుంది. లండన్‌లోని ‘పెటిట్‌ ప్లీ’కి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త చలివస్త్రానికి రూపకల్పన చేశారు. దీని ధర 500 పౌండ్లు (రూ.50,104).

చదవండి: ఇది మరో కేజీఎఫ్‌.. రియల్‌ ఎస్టేట్‌ సంపాదన, భవనం మొత్తం బంగారమే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top