3.75–4 శాతానికి దిగివచ్చిన వడ్డీ రేట్లు
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు పరపతి సమీక్షను చేపట్టిన యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ఈ ఏడాది రెండోసారి వడ్డీ రేట్లలో కోతకు మొగ్గుచూపింది.
సెప్టెంబర్‌లో నిర్వహించిన గత సమావేశంలో ఎఫ్‌వోఎంసీ.. 2024 డిసెంబర్ తదుపరి మళ్లీ ఫండ్స్ రేట్లను 0.25 శాతంమేర తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకూ ఫెడ్ ఫండ్స్ రేట్లు 4–4.25 శాతంగా అమలవుతున్నాయి. కాగా.. సెప్టెంబర్ చివరికల్లా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 3 శాతానికి బలపడగా.. ఆగస్ట్‌లో నిరుద్యోగిత 4.3 శాతానికి పెరిగింది. మరోపక్క ప్రభుత్వ షట్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఫెడ్ తాజా సమీక్షలో మరో పావు శాతం వడ్డీ రేటు కోతకే మొగ్గుచూపినట్లు ఆర్థికవేత్తలు విశ్లేషించారు.
ఇదీ చదవండి: వేతనాలు.. అమెరికాలో పెరుగుదల Vs భారత్‌లో తగ్గుదల


