
వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మాటలు సర్వత్రా చర్చకు దారితీశాయి. ఆ తరువాత వారానికి 90 గంటలు పనిచేయాలని లార్సన్ అండ్ టుబ్రో చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ అన్నారు. అయితే ఇప్పుడు వారానికి 80 గంటలు పనిచేయాలని శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న భారతీయ వ్యవస్థాపకురాలు 'నేహా సురేష్' అంటున్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.
''మీరు మీ కలను సాకారం చేసుకోవాలంటే రోజుకు 14 గంటలు పని చేయాలి. రోజూ 9 నుంచి 5 గంటల వరకు పనిచేస్తే ప్రపంచాన్ని మార్చే ఉత్పత్తిని అభివృద్ధి చేయలేరు. వారానికి 80 గంటల పని అనేది అంత కష్టమైనదేమీ కాదు'' అంటూ నేహా సురేష్ ట్వీట్ చేస్తూ.. ఒక వీడియో కూడా షేర్ చేసారు.
ఇదీ చదవండి: సమయాన్ని, డబ్బును దేనికి ఖర్చు చేస్తారు?: రాబర్ట్ కియోసాకి
నేహా సురేష్ షేర్ చేసిన వీడియోలో.. ఆమె సహా వ్యవస్థాపకుడు ఆకాష్ పనిచేస్తున్నారు. ఇందులో వారి రోజువారీ పని ఎలా జరుగుతుందో గమనించవచ్చు. మధ్య మధ్య చిన్న బ్రేక్స్ తీసుకుని వారి పనిని కొనసాగిస్తుండటం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.
If you're not spending 14+ hours a day working on your dream you're ngmi.
You can’t build a world-changing product on 9–5 energy.
80-hour weeks aren’t extreme. It's baseline. pic.twitter.com/6lTxrqUxJZ— Neha (@Neha_Suresh_M) July 31, 2025