
ముంబై: యూనియన్ మ్యూచువల్ ఫండ్ ‘యూనియన్ ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఎఫ్‌వోఎఫ్’ను ప్రవేశపెట్టింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్). వడ్డీ రేట్లు తగ్గుతున్న తరుణంలో పన్ను ప్రయోజనకరమైన ఆదాయాన్నిచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
జూన్ 5 వరకు పెట్టుబడులకు ఈ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) అందుబాటులో ఉంటుంది. ఆర్బిట్రేజ్, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మధ్యకాలం నుంచి దీర్ఘకాలంలో ఆదాయాన్నిచ్చే లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది.
రెండేళ్లకు మించి పెట్టుబడులు కలిగి ఉన్న వారికి ఈక్విటీ ఆధారిత పన్ను ప్రయోజనాలు వర్తించేలా ఈ పథకం ఆర్బిట్రేజ్ పెట్టుబడుల విధానాన్ని అనుసరిస్తుంది. సంపద సృష్టించడమే కాకుండా దాన్ని కాపాడుకోవడం అన్నది అస్సెట్ అలోకేషన్‌కు కీలకంగా యూనియన్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.