యూనియన్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లు పెంపు | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ రేట్లు పెంపు

Published Sat, Jun 18 2022 6:28 AM

Union Bank of India raises interest rates on deposits - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగంలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) అన్ని కాలపరిమితులకు సంబంధించి డిపాజిట్లపై వడ్డీరేట్లను శుక్రవారం పెంచింది. దేశీయ టర్మ్‌ డిపాజిట్లు, నాన్‌–రెసిడెంట్‌ ఆర్డినరీ (ఎన్‌ఆర్‌ఓ), నాన్‌–రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఈ) టర్మ్‌ డిపాజిట్లకు పెంపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది.

ప్రకటన ప్రకారం దేశీయ, ఎన్‌ఆర్‌ఓ టర్మ్‌ డిపాజిట్‌ రేటు(రూ.2 కోట్లు లోపు)పై 46–90 రోజుల మధ్య 55 బేసిస్‌ పాయింట్లు పెరిగి (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) 3.50 శాతం నుంచి 4.05 శాతానికి చేరింది. ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపోను మే, జూన్‌ నెలల్లో 90 బేసిస్‌ పాయింట్లు పెంచిన నేపథ్యంలో పలు బ్యాంకులు రుణ, డిపాజిట్‌ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే.  

Advertisement
 
Advertisement
 
Advertisement