
మైక్రోసాఫ్ట్ కంపెనీలో గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న లిసా మొనాకో (Lisa Monaco)ను వెంటనే తొలగించాలని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ (Microsoft) అమెరికా ప్రభుత్వంతో కలిగి ఉన్న ప్రధాన ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఆమె అమెరికా జాతీయ భద్రతకు ముప్పు అని అన్నారు.
''లిసా మొనాకోకు మైక్రోసాఫ్ట్‌లో అత్యంత సున్నితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని.. ఆ రకమైన యాక్సెస్ కలిగి ఉండటం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ పేర్కొన్నారు.
మొనాకో చేసిన అనేక తప్పుడు చర్యల కారణంగా, అమెరికా ప్రభుత్వం ఇటీవల ఆమెకు ఉన్న అన్ని భద్రతా అనుమతులను తొలగించింది. అంతే కాకుండా జాతీయ భద్రతా నిఘాకు సంబంధించిన అన్ని అవకాశాలను తొలగించడం, అన్ని ఫెడరల్ ప్రాపర్టీల నుంచి ఆమెను నిషేధించింది. మైక్రోసాఫ్ట్ వెంటనే లిసా మొనాకో ఉద్యోగాన్ని రద్దు చేయాలని నా అభిప్రాయం'' అని ట్రంప్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్‌లో పోస్ట్ చేశారు. దీనిపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పందించలేదు.
ఇదీ చదవండి: 'ఉద్యోగ భద్రత ఒక జోక్': రాబర్ట్ కియోసాకి
ఎవరీ లిసా మొనాకో?
ఈ ఏడాది జూలైలో లిసా మొనాకో మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అఫైర్స్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె గతంలో 2021 నుంచి జనవరి 2025 వరకు నాలుగు సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్ డిప్యూటీ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2013 నుంచి 2017 వరకు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేశారు. మొనాకో.. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 2011లో జాతీయ భద్రతకు అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, రెండేళ్లు ఆ పదవిలో పనిచేశారు.