టాటా టెక్‌ సూపర్‌ హిట్‌.. గాంధార్‌ ఆయిల్‌ ఘనం

Tata Technologies lists at 140 percent premium over IPO price - Sakshi

న్యూఢిల్లీ: టాటా టెక్నాలజీ షేరు లిస్టింగ్‌ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.500)తో పోలిస్తే 140% ప్రీమియంతో రూ.1,200 వద్ద లిస్టయ్యింది. ఒక దశలో 180% ఎగసి రూ.1,400 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 163% లాభపడి రూ.1,314 వద్ద స్థిరపడింది. వెరసి ఈ ఏడాది(2023) లిస్టింగ్‌ రోజు అత్యధిక లాభాలు పంచిన షేరుగా రికార్డు సృష్టించింది. కంపెనీ విలువ రూ.52,940 కోట్లుగా నమోదైంది.  

గాంధార్‌ సెంచరీ...
గాంధార్‌ ఆయిల్‌ రిఫైనరీ షేరు ఘనంగా లిస్టయ్యింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ.169)తో పోలిస్తే 75% ప్రీమియంతో రూ.295 వద్ద లిస్టయ్యింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ట్రేడింగ్‌లో మరింత దూసుకెళ్లింది. ఒక దశలో 104% ర్యాలీ చేసి రూ.345 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్‌ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లాభాలు కొంతమేర తగ్గాయి. చివరికి 78% లాభంతో రూ.301.50 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో మొత్తం 29.06 లక్షల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.2,951 కోట్లుగా నమోదైంది.  

ఫెడ్‌ ఫినా.. ప్చ్‌!
ఫెడ్‌బ్యాంక్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ షేరు లిస్టింగ్‌లో నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర (రూ. 140)తో పోలిస్తే 1.50% డిస్కౌంట్‌తో రూ.138 వద్ద లిస్టయ్యింది. ప్రారంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లిస్టింగ్‌ నష్టాలు భర్తీ చేసుకొంది. ఒక దశలో 6% ర్యాలీ చేసి రూ.148 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో చివరికి ఇష్యూ ధర రూ.140 వద్దే ముగిసింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.5,378 కోట్లుగా నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top