సియెరా ఈవీ లాంచ్ ఎప్పుడంటే? | Tata Sierra EV Launch Confirmed for June 30 | Sakshi
Sakshi News home page

సియెరా ఈవీ లాంచ్ ఎప్పుడంటే?

Jun 12 2026 4:54 AM | Updated on Jun 12 2026 4:54 AM

Tata Sierra EV Launch Confirmed for June 30

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా సియెరా (Tata Sierra).. జూన్ 30న ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమైంది. 2020 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ కారు త్వరలోనే రోడ్డెక్కనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

లాంచ్ తరువాత సియెరా ఎలక్ట్రిక్ కారును కంపెనీ కార్వ్ ఈవీ, హారియార్ ఈవీ మధ్యలో ఉంచనుంది. ఇది కూడా acti.ev+ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమవుతుంది. కాగా ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) ఎంపికలలో అందుబాటులో ఉండనుంది.

టాటా సియెరా ఈవీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది. పెద్ద బ్యాటరీ ఉన్న వేరియంట్ AWD సిస్టమ్‌తో రావచ్చని అంచనా. డిజైన్ పరంగా.. ముందు భాగంలో క్లోజ్డ్ గ్రిల్, కొత్త బంపర్ డిజైన్, ఈవీ బ్యాడ్జింగ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఏరోడైనమిక్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. సియెరా ఈవీ చాలా ప్రీమియం ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. టాప్ వేరియంట్లలో మూడు స్క్రీన్‌ల (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ప్యాసింజర్ డిస్‌ప్లే) సెటప్ ఉండవచ్చు. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవ్ మోడ్‌లు, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ధర విషయానికి వస్తే.. సియెరా ఈవీ సుమారు రూ.18 లక్షల నుంచి రూ.25 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ఇది ఇండియన్ మార్కెట్లో మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ క్రెటా ఈవీ, ఎంజీ జెడ్ ఈవీ, మారుతి ఈ విటారా వంటివాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement