నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రీన్‌ ఎనర్జీపై టాటా శిక్షణ!

Tata Power Train Around 3000 Youth In Green Energy Jobs In Fy 23 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదన ఇంధన వనరుల రంగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు టాటా పవర్‌ ప్రకటించింది. 2025 నాటికి మొత్తం 5,000 మంది యువతకు శిక్షణ ఇస్తామని కంపెనీ వెల్లడించింది. 

సంప్రదాయ, పునరుత్పాదన ఇంధన రంగంలో ఇప్పటి వరకు 1.4 లక్షల మంది టాటా పవర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా నైపుణ్య శిక్షణ అందుకున్నారు. 

ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌కు అవసరమైన సోలార్‌ ఫోటోవోల్టాయిక్, రూఫ్‌టాప్‌ సోలార్‌ ఫోటోవోల్టాయిక్‌ ఇన్‌స్టాలేషన్, మెయింటెనెన్స్, స్మార్ట్, సమర్థవంతమైన ఇంధన విభాగాల్లో హోమ్‌ ఆటోమేషన్‌ తదితర అంశాల్లో తర్ఫీదు ఇస్తారు 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top