టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో   | Tata Nexon XM(S) Variant Launched | Sakshi
Sakshi News home page

టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) : ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో  

Sep 2 2020 2:18 PM | Updated on Sep 2 2020 2:24 PM

Tata Nexon XM(S) Variant Launched - Sakshi

సాక్షి,ముంబై: టాటా మోటార్స్  ప్రీమియం ఫీచర్లు,ఆధునిక సాంకేతికలతో కొత్త టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) వేరియంట్‌ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది.  ప్రీమియం ఫీచర్లు, సరసమైన ధరలతో నెక్సాన్ ను మరింత అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో విడుదల చేశామని టాటా మోటార్స్ ప్రకటించింది.  ఇది  నాలుగు ట్రిమ్‌లలో లభిస్తుంది. పెట్రోల్, డీజిల్‌ ఇంజీన్ ఆప్షన్లలో, ఎంటీ, ఎఎంటీ  వేరియంట్లలో లభ్యం.  టాటా నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) 8.36 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరకు అందిస్తోంది. 

ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, డ్రైవర్, కో-డ్రైవర్ ఎయిర్‌బ్యాగులు, హిల్ హోల్డ్ కంట్రోల్, హర్మన్  అండ్  మల్టీ డ్రైవ్ మోడ్‌ల కనెక్ట్‌నెక్స్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ (ఎకో, సిటీ) లాంటి  అత్యాధునిక  స్పెసిషికేషన్స్ జోడించింది. నెక్సాన్ మోడల్ కారు టాటా మోటార్స్‌కు గర్వకారణమనీ, మారుతున్న కస్టమర్ల డిమాండ్లకనుగుణంగా ఉత్పత్తులను మరింత తాజాగా ఉంచుతామన్న హామీని కొనసాగిస్తూ, నెక్సాన్ ఎక్స్‌ఎమ్ (ఎస్) ప్రారంభిండం సంతోషంగా ఉందని టాటా మోటార్స్ మార్కెటింగ్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ (పివిబియు) హెడ్, వివేక్ శ్రీవత్స తెలిపారు. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అత్యుత్తమ లక్షణాలతో, ఆకర్షణీయమైన ధరలకు ప్రీమియం డ్రైవింగ్ ఆనందాన్నిచ్చేలా అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.

ఇంజీన్లు: 
పెట్రోల్ వెర్షన్లు 1.2 లీటర్, 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తాయి,. ఇది 118 బిహెచ్‌పి,  17.33టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 
1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజీన్  108 బిహెచ్‌పీ పవర్ ను అందిస్తుంది. 

ధరలు
నెక్సాన్ ఎక్స్‌ఎం (ఎస్) పెట్రోల్ ధర రూ .8.36 లక్షలు
నెక్సాన్  ఎక్స్‌ఎం (ఎస్) డీజిల్ ధర రూ .9.70 లక్షలు
నెక్సాన్  ఎక్స్‌ఎంఎ (ఎస్) ఏఎంటీ ‌ పెట్రోల్‌  ధర రూ .8.96 లక్షలు
నెక్సాన్ ఎక్స్‌ఎంఎ (ఎస్)  ఏఎం‌టి డీజిల్‌ ధర రూ .10.30 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement