Tata Motors: కొనుగోలుదారులకు శుభవార్త!

Tata Motors partners IndusInd Bank to push passenger vehicle sales - Sakshi

ప్యాసింజర్‌ వాహన విక్రయాలపై టాటా మోటార్స్‌ కన్ను

టాటా మోటార్స్‌తో ఇండస్‌ఇండ్‌ బ్యాంకు జట్టు

వాహన విక్రయాలకు రుణాలు, స్టెపప్‌ పథకం

సాక్షి, న్యూఢిల్లీ:  ప్యాసింజర్‌ వాహనాల కొనుగోలుదారులకు ఇండస్‌ఇండ్‌ బ్యాంకు తరఫున రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు టాటా మోటార్స్‌ ప్రకటించింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు భాగస్వామ్యంతో స్టెపప్‌ పథకాన్ని అందిస్తున్నట్టు.. ఇందులో భాగంగా మొదటి 3-6 నెలల పాటు తక్కువ ఈఎంఐను ఎంపిక చేసుకోవచ్చని తెలిపింది. తన ప్యాసింజర్‌ వాహనాల శ్రేణిలో ఏ వాహనానికైనా ఈ సదుపాయాన్ని పొందొచ్చని ప్రకటించింది.

ముఖ్యంగా  టియాగో, నెక్సాన్ లేదా ఆల్ట్రోజ్ వంటి తక్కువ ఖరీదైన వాహనాల కొనుగోలులో ఎక్స్-షోరూమ్ ధరపై 90 శాతం దాకా ఎల్‌టివికి అందుబాటులో ఉంచింది. అలాగే హారియర్, సఫారి, టైగోర్ వంటి ఖరీదైన వాహనాల కొనుగోలులో 85 శాతం వరకు (ఎల్‌టివి) రుణ  సౌకర్యాన్ని కల్పిస్తోంది. కోవిడ్‌-19 సంక్షోభంతో ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసేందుకు ఇండస్‌ ఇండ్‌ భాగస్వామ్యంతో  ప్రత్యేక ఫైనాన్స్ పథకాలను తీసుకురావడం సంతోషంగా ఉందని  ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ హెడ్ నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్ రమేష్ డోరైరాజన్ అన్నారు.

అలాగేఈ వినూత్న ఆర్థిక పథకాల ద్వారా  కస్టమర్‌పై భారాన్ని తగ్గించడమే కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా ఈ  పథకాల నిమిత్తం టాటా మోటార్స్‌తో చేతులు కలపడం తమకు గర్వకారణమని ఇండస్ఇండ్ బ్యాంక్ ప్యాసింజర్ వెహికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్  టీఏ రాజగోప్పలన్  తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top