StockMarketOpening: తగ్గేదెలే.. భారీ లాభాలు, నిఫ్టీ బ్యాంకు రికార్డ్

60650 ఎగువకు సెన్సెక్స్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు ఎగిసి 60655 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 18083 వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.(వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్‌బీఐ ఎంట్రీ)
ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల లాభాలు మార్కెట్‌కు మద్దతిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్ర, ఎస్‌బీఐ భారీగా లాభపడుతున్నాయి. అటు హిందాల్కో, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, సిప్లా నష్టపోతున్నాయి.