పరిమాణం కొంచెం.. పనులు ఘనం! | Small but Smart Gadgets That Make Life Easier Every Day | Sakshi
Sakshi News home page

పరిమాణం కొంచెం.. పనులు ఘనం!

Apr 26 2026 6:08 PM | Updated on Apr 26 2026 6:17 PM

Small but Smart Gadgets That Make Life Easier Every Day

చూడటానికి చిన్నగా ఉంటాయి కాని, పని మొదలుపెడితే పెద్ద పెద్ద టెన్షన్లనే తగ్గిస్తాయి. చూడటానికి చిన్నగా ఉంటూ, ఎక్కువ సౌలభ్యం అందిస్తూ, మీ టైమ్‌ను సేవ్‌ చేసే స్మార్ట్‌ గాడ్జెట్లే ఇవి!

చల్లని గాలి, మీతోనే ఎక్కడికైనా!
వేసవిలో విపరీతమైన చెమటతో ఇబ్బంది పడుతున్నారా? చేతిలో ఫ్యాన్ పట్టుకుని తిరగడం కష్టంగా ఉందా? అయితే ఈ పోర్టబుల్‌ మినీ బ్లేడ్‌లెస్‌ ఫ్యాన్ ఒక స్మార్ట్‌ సొల్యూషన్! ఇది చిన్నదైనా, చల్లని గాలిని ఎప్పుడైనా, ఎక్కడైనా అందించేలా  పనిచేస్తుంది. ఈ ఫ్యాన్‌లో మూడు స్పీడ్‌ సెట్టింగ్స్‌ ఉంటాయి. అవసరానికి అనుగుణంగా గాలి వేగాన్ని సులభంగా మార్చుకోవచ్చు. బ్లేడ్లు లేకుండా డిజైన్  చేసినందువల్ల జుట్టు చిక్కుకునే భయం ఉండదు. పైగా ఇది మెడకు లేదా నడుముకు క్లిప్‌ చేసుకునేలా ఉండటంతో చేతులు ఫ్రీగా ఉంటాయి. బయట పనులు చేసుకుంటున్నప్పుడు, ట్రావెల్‌లో లేదా ఆఫీసులో కూడా సౌకర్యంగా వాడుకోవచ్చు. రీచార్జబుల్‌ బ్యాటరీతో పనిచేసే ఈ ఫ్యాన్ ఒకసారి చార్జ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు చల్లని గాలిని అందిస్తుంది. ధర రూ. 4,160.

చిన్న ప్రింటర్‌! 
ప్రతి చిన్న ప్రింటౌట్‌ కోసం జిరాక్స్‌ షాపుకు వెళ్లకుండా.. మీ చేతిలోనే ఒక చిన్న స్మార్ట్‌ ప్రింటర్‌ ఉంటే ఎంత బాగుంటుంది! ఈ మినీ బ్లూటూత్‌ థర్మల్‌ ప్రింటర్‌ ఉంటే జిరాక్స్‌తో పని ఉండదు. స్టూడెంట్స్‌కు ఇంట్లో వాడుకోవడానికి, చిన్న చిన్న ప్రింటౌట్లు తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్‌ చాయిస్‌. మొబైల్‌తో బ్లూటూత్‌ ద్వారా సులభంగా కనెక్ట్‌ చేసుకుని వాడుకోవచ్చు. నోట్స్, స్టిక్కర్స్‌ లేదా చిన్న ఫోటోలను కొన్ని సెకండ్లలోనే ప్రింట్‌ చేసుకోవచ్చు. ఇంక్‌ అవసరం లేకుండా థర్మల్‌ టెక్నాలజీతో పనిచేయడం వల్ల ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. పైగా దీనిని జేబులో లేదా బ్యాగ్‌లో సులభంగా పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. చార్జ్‌ చేసుకుని ఎప్పుడైనా ఉపయోగించు కోవచ్చు. చదువుకునే పిల్లలకు, చిన్న నోట్స్‌ ప్రింట్‌ చేసుకునే వారికి లేదా రోజువారీ పనులను సులభం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక స్మార్ట్‌ హెల్పర్‌లా ఉంటుంది. ధర రూ. 1,799.

చార్జ్‌ కూడా.. స్టాండ్‌ కూడా!
మొబైల్‌ను చార్జ్‌ చేస్తూనే వీడియోలు, సీరియల్స్‌ చూడాలా? లేదా గేమ్స్‌ ఆడాలా? అయితే మీ కోసం వచ్చేసింది ఈ టూ ఇన్‌ వన్ స్మార్ట్‌ చార్జర్‌ కేబుల్‌. ఇది కేవలం కేబుల్‌ మాత్రమే కాదు, చిన్న స్టాండ్‌లా కూడా పనిచేసే స్మార్ట్‌ ఐడియా. ఈ కేబుల్‌లో బిల్టిన్  ఫోల్డబుల్‌ స్టాండ్‌ ఉంటుంది. కేబుల్‌ పెట్టగానే మొబైల్‌ సూటిగా నిలబడేలా సౌకర్యంగా ఉంటుంది. పైగా దీనికున్న ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో మొబైల్, టాబ్లెట్‌ లేదా ఇతర పరికరాలను వేగంగా చార్జ్‌ చేయవచ్చు. బలమైన నైలాన్ మెటీరియల్‌తో తయారైన ఈ కేబుల్‌ ముడిపడకుండా ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. ఇంటి వద్ద, ఆఫీస్‌లో లేదా ట్రావెల్‌లో ఎక్కడైనా సులభంగా వాడుకోవచ్చు. ధర కేవలం రూ. 791 మాత్రమే!

Advertisement
 
Advertisement
Advertisement