ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!

SBI Account Holders Get Benefit of RS 4 Lakhs in Just RS 342 - Sakshi

2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బీమా గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.342తో డబ్బులు కడితే ఏకంగా రూ.4 లక్షల విలువ గల భీమా ప్రయోజనం మీరు పొందొచ్చు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పిఎంఎస్‌బివై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పిఎంజెజెబివై) మీకు రూ.4 లక్షల వరకు ప్రమాద బీమా + జీవిత బీమా అందిస్తున్నాయి.  అయితే, దీని కోసం మీరు కేవలం రూ.342 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఖాతాదారుడి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం కట్ అవుతుంది అని బ్యాంకు తెలియజేసింది.

(చదవండి: జియోఫోన్‌ నెక్ట్స్ లాంచ్‌...! సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు..!)

ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా తీసుకున్న ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా వికలాంగులైనా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యం పొందినట్లయితే అతడు/ఆమెకు లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది. దీనిలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా చేరవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే.  

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు వరకు పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం కూడా మీరు కేవలం రూ.330 వార్షిక ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుందని తెలుసుకోవాలి. భీమా పొందాలంటే మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ప్రీమియం మినహాయింపు సమయంలో బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా బీమాను రద్దు చేసుకోవచ్చు. 

(చదవండి: ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top