గుడ్‌ న్యూస్‌: 15,000 ఉద్యోగాలు.. ప్రారంభమైన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ క్యాంపస్‌ నిర్మాణం

sap labs new campus construction begins to create 15000 jobs - Sakshi

జర్మనీకి చెందిన మల్టీనేషన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ శాప్‌ (SAP) ల్యాబ్స్ బెంగళూరులో రెండో క్యాంపస్‌ నిర్మాణాన్ని తాజాగా ప్రారంభించింది. 15,000 మంది ఉద్యోగులు పని చేసేందుకు సరిపోయేలా ఈ క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. 

శాప్‌ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడింట్‌ సింధు గంగాధరన్ కొత్త క్యాంపస్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో 41.07 ఎకరాల విస్తీర్ణంలో  కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2025 నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. 

‘శాప్‌ ల్యాబ్స్ ఇండియా 25వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం బెంగళూరులో 15,000 ఉద్యోగాలను సృష్టించే కొత్త 41 ఎకరాల క్యాంపస్‌తో భారతదేశంలో మా పెట్టుబడులను మరింతగా పెంచుతున్నాం’ అని శాప్‌ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సీనియర్‌ వైస్‌ ప్రెసిడింట్‌ సింధు గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు.

భారత్‌లో ప్రస్తుతం శాప్‌ ల్యాబ్స్‌కు అతిపెద్ద ఆర్‌అండ్‌డీ హబ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ మొత్తం ఆర్‌అండ్‌డీ విభాగంలో 40 శాతం వాటా దీని నుంచి ఉంది. కొత్త క్యాంపస్ నిర్మాణం భారతదేశం పట్ల తమ నిబద్ధతను మరింత బలపరుస్తుందని శాప్‌ కంపెనీ తెలిపింది.

ఇదీ చదవండి: ట్విటర్‌ క్రాష్‌: ఇష్టమొచ్చినట్లు ఉద్యోగులను పీకేస్తే ఇలాగే ఉంటుంది!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top