శాంసంగ్ 5జీ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్: అంచనాలు

Samsung Galaxy A42 5G Smartphone 5000mAh Battery - Sakshi

 ఏ42 పేరుతో రానున్న మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్

5000 ఎంఏహెచ్ బ్యాటరీ

సాక్షి, ముంబై : చైనా బ్యాన్ డిమాండ్ నేపథ్యంలో దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్  వేగం పెంచింది. త్వరలో గెలాక్సీ ఏ42 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే  యోచనలో ఉన్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  గీక్ బెంచ్ అందించిన సమాచారం ప్రకారం..  5జీ టెక్నాలజీతో, క్వాల్కం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్ తో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఇప్పటికే సేఫ్టీ కొరియా సర్టిఫికేషన్ వెబ్ సైట్లోనూ, చైనా 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్లోనూ దర్శనమివ్వడం గమనార్హం.  గెలాక్సీ ఏ41 స్మార్ట్ ఫోన్ కు తర్వాతి వెర్షన్ గా దీన్ని తీసుకురానుంది. అంతేకాదు శాంసంగ్ 5జీలో ఇదే తొలి బడ్జెట్ ఫోన్ కానుందనే వాదన కూడా వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో లాంచ్ కావచ్చని భావిస్తున్న శాంసంగ్ గెలాక్సీ ఏ42  ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. 

6.1 అంగుళాల డిస్ ప్లే
1080 x 2400 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం 
క్వాల్కం  స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్
4, 6 జీబీ ర్యామ్ /128 జీబీ స్టోరేజ్
48 ప్రధాన కెమెరాగా ట్రిపుల్ రియర్ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా  
5000 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top