రూపాయి 60 పైసలు క్రాష్‌..!  | Rupee slumps 60 paise to 95.85 against U.S. dollar | Sakshi
Sakshi News home page

రూపాయి 60 పైసలు క్రాష్‌..! 

Jun 12 2026 1:04 AM | Updated on Jun 12 2026 1:04 AM

Rupee slumps 60 paise to 95.85 against U.S. dollar

డాలర్‌ మారకంలో 95.85 వద్ద ముగింపు

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ 60 పైసలు క్షీణించి 95.85 వద్ద ముగిసింది. పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్‌ మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం, అంతర్జాతీయంగా డాలర్‌ బలోపేతం కావడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి. 

ఉదయం ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 95.55 వద్ద ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడికి లోనవుతూ, కోలుకోలేకపోయింది. ఒకానొకదశలో ఇంట్రాడే కనిష్ట స్థాయి 95.85ను తాకిన రూపాయి, చివరికి అదే స్థాయి వద్ద ముగిసింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 95 డాలర్ల దిశగా కదలడం, అమెరికా చమురు నిల్వలు తగ్గడం వల్ల సరఫరా కొరత భయాలు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement