ఫోర్బ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌ ర్యాంకింగ్స్‌.. జాబితాలో ఉన్న ఇండియన్‌ కంపెనీలు ఏవంటే?

Reliance Tops India Inc In Worlds Best Employer Rankings 2021 - Sakshi

రిలయన్స్‌ సంస్థకి మరో అరుదైన గౌరవం దక్కింది. 2021 ఏడాదికి గాను ఫో‍ర్బ్స్‌ సంస్థ ప్రకటించిన బెస్ట్‌ ఎంప్లాయర్‌ ర్యాకింగ్స్‌లో 52వ స్థానం దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 750 కంపెనీలను ఈ ర్యాంకింగ్స్‌ కోసం పరిశీలించగా రిలయన్స్‌ సంస్థకి 52వ స్థానం దక్కింది.

టాప్‌ 100లో
ఫోర్బ్స్‌ బెస్ట్‌ ఎంప్లాయర్‌ అవార్డులకు సంబంధించి టాప్‌ 100 జాబితాలో మొత్తం నాలుగు సంస్థలకే చోటు దక్కింది. అందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 52వ స్థానంలో నిలవగా ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్‌ 65వ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 77, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 90 ర్యాంకును దక్కించుకున్నాయి. ప్రతిష్టాత్మక ఎస్‌బీఐ 117వ, ఎల్‌ అండ్‌ టీ 127వ స్థానాలకే పరిమితం అయ్యాయి.

నంబర్‌ వన్‌ 
ఇక ప్రపంచ వ్యాప్తంగా ర్యాంకులను పరిశీలిస్తే శామ్‌సంగ్‌ సంస్థ ప్రథమ స్థానంలో నిలవగా ఐబీఎం కంప్యూటర్స్‌ ద్వితీయ స్థానం దక్కించుకుంది. మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, యాపిల్‌, గూగుల్‌, డెల్‌, హువావేలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

లక్షన్నర మంది నుంచి
ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు చెందిన 750 కంపెనీల నుంచి 1,50,000ల మంది ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగుల నుంచి ఈ అభిప్రాయాలను సేకరించి ఫోర్బ్స్‌ ఈ జాబితాను రూపొందించింది. ఈ సందర్భంగా ఉద్యోగుల నుంచి కంపెనీ ఆర్థిక ప్రణాళిక, లింగ సమానత్వం, సామాజిక బాధ్యత, టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ తదితర అంశాలపై వివరాలు సేకరించారు.

ఇతర ఇండియన్‌ కంపెనీలు
ఫోర్బ్స్‌ బెస్ట్‌ఎంప్లాయర్‌ ర్యాకింగ్స్‌లో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ కంపెనీల విషయానికి వస్తే బజాజ్‌ 215, యాక్సిస్‌ బ్యాంక్‌ 215, ఇండియన్‌ బ్యాంక్‌ 314, ఓన్‌ఎన్‌జీసీ 404, అమర్‌రాజా గ్రూపు 405,  కోటక్‌ మహీంద్రా 415, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 451, ఐటీసీ 453, సిప్లా 460, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 496, ఎల్‌ఐసీ 504, ఇన్ఫోసిస్‌ 588, టాటా గ్రూపు 746వ స్థానాలు దక్కించుకున్నాయి. 

చదవండి : 40 ఏళ్లకే తరగనంత సంపద

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top