మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్‌లో వీడియో వైరల్‌

Reliance Mukesh Ambani brings baby granddaughter home in luxury car convoy - Sakshi

రూ. 50 కోట్ల లగ్జరీ కార్ కాన్వాయ్‌

20 దేశీయ విదేశీయ కార్లతో భారీ కాన్వాయ్‌ 

సాక్షి, ముంబై: ముద్దుల మనవరాలి కోసం కొండమీద కోతినైనా తీసుకురాగల సామర్థ్యం ఆసియా బిలియనీర్‌, రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ సొంతం. అందుకే ఏకంగా మనవరాలు బుల్లి ప్రిన్సెస్‌ను ఇంటికి తీసుకెళ్లందుకు భారీ కాన్వాయ్‌నే ఏర్పాటు చేయారు. సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌నుంచి లగ్జరీ కార్లతో కూడిన భారీ కార్ కాన్వాయ్‌తో పాపాయిని ఇంటికి ఆహ్వానించి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో బిజినెస్‌ వర్గాల్లోనూ విశేషంగా నిలుస్తోంది.

దిగ్గజ పారిశ్రామికవేత్త మనవరాలు భారీ భద్రత మధ్య, దేశీయ, విదేశీ లగ్జరీ కార్లు కాన్వాయ్‌తో ఇంటికి చేరింది.   సుమారు 50 కోట్లకు పైగా విలువైన 20కి పైగా కార్లు ఉన్నాయి.రోల్స్ రాయిస్ కల్లినన్ SUV, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-AMG G63, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-మేబ్యాక్ S580 లాంటి  సూపర్‌ లగ్జరీ కార్లతో భారీ కాన్వాయ్‌ ముంబై వీధుల్లో సందడి చేసింది.  (యావద్దేశం మూగగా..ఫెయిల్-సేఫ్ మెకానిజంపై ఆనంద్‌ మహీంద్ర వ్యాఖ్యలు)

అంబానీ పెద్ద  కుమారుడు ఆకాష్ అంబానీ భార్య శ్లోకా మెహతా గత వారం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఇప్పటికే పృథ్వి అనే కుమారుడు కూడా ఉన్నాడు. అంబానీ కుటుంబంలోని ఈ పాపాయి రావడంతో  ముఖేశ్‌, నీతా అంబానీ తరువాతి వారసుల సంఖ్య నాలుగుకి చేరింది. కుమార్తె  ఇషా, ఆనంద్‌ పిరామల్‌ దంపతులకు  ట్విన్స్‌ కృష్ణ ,ఆదియా  ఉన్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top