అనధికారిక ఫారెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించవలసిందిగా ఇన్వెస్టర్లను రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా హెచ్చరించింది. ఇప్పటికే ఇలాంటి సంస్థల జాబితాను విడుదల చేసిన ఆర్‌బీఐ కొత్తగా అలర్ట్ లిస్ట్‌లో 7 ప్లాట్‌ఫామ్స్‌ను జత చేసింది. దీంతో వీటి సంఖ్య 95కు చేరింది. వీటిలో స్టార్‌నెట్ ఎఫ్‌ఎక్స్, క్యాప్‌ప్లేస్, మిర్రరాక్స్, ఫ్యూజన్ మార్కెట్స్, ట్రైవ్, ఎన్‌ఎక్స్‌జీ మార్కెట్స్, నార్డ్ ఎఫ్‌ఎక్స్ చేరాయి.
విదేశీ మారక నిర్వహణ చట్టం, 1999(ఫెమా) ప్రకారం జాబితాలోని సంస్థలకు అధికారికంగా ఫారెక్స్ లావాదేవీలు చేపట్టేందుకు అనుమతిలేకపోవడంతోపాటు.. ఎల్రక్టానిక్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్(ఈటీపీలు)ను సైతం నిర్వహించేందుకు వీలులేదని కేంద్ర బ్యాంకు పేర్కొంది. అంతేకాకుండా జాబితాలోని సంస్థలు, ప్లాట్‌ఫామ్స్, వెబ్‌సైట్లు ప్రకటనల ద్వారా అనధికారిక ఈటీపీలను ప్రమోట్ చేస్తున్నట్లు వెల్లడించింది. శిక్షణ, అడ్వయిజరీ సర్వీసులందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటున్నాయని తెలియజేసింది.


